పోలీసు బృందాలే లక్ష్యంగా ఉగ్రవాదుల బాంబు దాడి.. ఐదుగురు మృతి

-

పాకిస్థాన్ ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం పోలీసు బృందాలే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొండా బజార్ ప్రాంతంలోని ట్యాంక్​ అడ్డా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, కేబీ బాంబ్​ డిస్పోజల్​ యూనిట్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో మృతి చెందిన ఐదుగురిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిపారు. దుండగులు ఓ మోటార్​ బైక్​లో పేలుడు పరికరాన్ని అమర్చారని సమాచారం. మరోవైపు ఘటన స్థలంలో తుపాకుల కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్​లో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో శుక్రవారం రోజున పాక్ సైనికులు కాన్వాయ్ పస్ని నుంచి గ్వాదర్ జిల్లాకు వెళ్తుండగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news