ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం

-

బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో మరో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఫిలిప్ ఐలాండ్‌కు చెందిన బీచ్‌ వద్ద నలుగురు నీట మునిగారు. బీచ్లో మునిగిపోయి వారంతా దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో ది బెస్ట్ పర్యాటక ప్రాంతమైన ఆ ప్రదేశంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన బుధవారం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఫిలిప్‌ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్‌బోర్న్‌ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్‌లో ఉన్నారని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news