ఈరోజుల్లో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రకరకాలుగా మోసాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా మోసాలకి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఫేక్ లోన్ యాప్స్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నారు సోషల్ మీడియాలో నకిలీ రుణ యాప్లతో ప్రజల్ని ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లని వాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లని సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన సన్నాహాలు చేసింది.
నకిలీ లోన్ యాప్ లో ఉచ్చులో బంధించిన ఇటువంటి కేసులు చాలా ఉన్నాయని తెలుస్తోంది. నకిలీ లోన్ యాప్ లకి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనని సవరిస్తామని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నివేదికలో చెప్పారు.