భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహత్మ గాంధీ కి అవమానం జరిగింది. ఆస్ట్రేలియా దేశంలో మహత్మ గాంధీ విగ్రాహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశం లో ని మెల్ బోర్న్ నగరంలో చోటు చేసుకుంది. అయితే ఈ విగ్రహ ధ్వంసం పై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్రం గా ఖండించారు. ఇలాంటి ఘటనలు ఆస్ట్రేలియా పరువు ను తీస్తాయని అన్నారు.
అలాగే ఈ ఘటన తమను చాలా అవమానించిందని అన్నారు. అలాగే ఇలాంటి చర్యల వల్ల తమ దేశాన్ని అగౌరవరిచేలా ఉంటుందని అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఆస్ట్రేలియా దేశ స్మారక చిహ్నా లపై దాడులు చేస్తే సహించమని తెల్చి చెప్పారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ గాంధీ విగ్రాహాన్ని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ఆవిష్కరించాడు. అయితే గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపాడు.