టైం వేస్ట్ అని చెప్పి ఐదేళ్ళుగా స్నానం చేయడం మానేసాడట.

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత శుభ్రత పట్ల ఆసక్తి బాగా పెరిగింది. చేతులు కడుక్కోకపోతే అదే మన పాలిట శాపంగా మారి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని అందరికీ తెలిసింది. అందుకే ప్రతీ ఒక్కరికీ శుభ్రత బాగా అలవాటయ్యింది. ఐతే శుభ్రత ఎక్కువగా చర్చించుకుంటున్న ఈ సమయంలో ఐదేళ్ళుగా స్నానం చేయని వారి గురించి తెలిస్తే నిజంగా అశ్చర్యంగా ఉంటుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికాకి చెందిన ఒకానొక డాక్టర్ ఐదేళ్ళుగా స్నానం చేయడం లేదట.

38సంవత్సరాల జేమ్స్ హ్యాంబ్లిన్ ఐదేళ్ళుగా స్నానం చేయట్లేదట. 2015నుండి ఇప్పటివరకు స్నానం చేయలేదట. ఐతే దానికి గల కారణం తెలిస్తే నిజంగా షాకవుతారు. రోజూ స్నానం చేయడం టైమ్ వేస్ట్ అని స్నానం చేయడమే మానేసాడట. ఐతే స్నానం చేయకపోవడం వల్ల పెద్ద ఇబ్బందేమీ కలగదని చెబుతున్నాడు. కాకపోతే స్నానం చేయకపోయినా, ప్రతి రోజూ, చేతులు కడుక్కోవడం, ముఖం కడుక్కోవడం, కాళ్ళు శుభ్రపర్చుకోవడం చేస్తుంటాడట.

Read more RELATED
Recommended to you

Latest news