బ్రేకింగ్: ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

-

హాలీవుడ్ స్టార్ హీరో “బ్లాక్ పాంథర్” నటుడు చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్ తో మరణించాడని హాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 43 ఏళ్ళ వయసు ఉన్న బోస్మాన్ గత కొంత కాలంగా ఈ క్యాన్సర్ తో బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. 2016 లో అతను ఈ క్యాన్సర్ బారిన పడ్డాడు. అయినా సరే ప్రధాన హాలీవుడ్ చిత్రాల్లో అతను మంచి పాత్రలు పోషించాడు.

“అతను తన ఇంటిలో, అతని భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండగానే ప్రాణాలు కోల్పోయాడని అతని వ్యక్తిగత కార్యదర్శి ఒకరు తెలిపారు. 2018లో వచ్చిన “బ్లాక్ పాంథర్” సినిమా సూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అతను ఇటీవల స్పైక్ లీ యొక్క “డా 5 బ్లడ్స్” లో కనిపించాడు. మరియు 2022 లో “బ్లాక్ పాంథర్” కి సీక్వెల్ లో కనిపించబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news