ఎర్రసముద్రంలో మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ నౌకపై దాడి,

-

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. అమెరికా, బ్రిటన్‌లు తీవ్రంగా యత్నిస్తున్నా హౌతీ తిరుబాటుదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ తాజాగా గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌ లో ఆయిల్‌ ట్యాంక్‌లతో వెళుతున్న నౌకపై క్షిపణితో దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనలో బ్రిటన్‌కు చెందిన మార్లిన్‌ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగడంతో నౌకలోని సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని నౌక ఆపరేటర్‌ ట్రాఫిగురా అధికారులు తెలిపారు. సౌత్‌ ఈస్ట్‌ ఆఫ్‌ ఎడెన్‌కు 60 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ పేర్కొంది. హౌతీ రెబల్స్ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మార్గంలో వెళుతున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news