ఉద్యోగులకు షాక్.. గూగుల్‌లో మరోసారి భారీ లేఆఫ్స్

-

ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. త్వరలోనే భారీగా ఉద్యోగులకు తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఏఐ వల్ల టెక్‌ రంగంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.

కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులను అందించడానికి ఇది ఒక సదావకాశం అని పేర్కొంటూనే.. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలూ తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని, ఈ క్రమంలోనే నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను బయటకు పంపాల్సి వస్తోందని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్‌వో తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని సీఈవో సుందర్‌ పిచాయ్‌ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విధుల్లోకీ గూగుల్‌ బదిలీ చేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఆ సంస్థ.. కొంతమందిని ఇక్కడకూ తీసుకొస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version