ఎలాన్‌ మస్క్‌కు ‘టెస్లా’ షాక్‌.. ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు నష్టం

-

ట్విటర్‌, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ఒక్కరోజులోనే ఏకంగా  20.3 బిలియన్‌ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.64లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోయారు. టెస్లా షేర్ల భారీ పతనంతో భారీగా సంపద కోల్పోయినా..  ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.

మరోవైపు..  ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే విద్యుత్ వాహనాల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్‌ తెలిపారు. గురువారం నాటి అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్ల ధర భారీగా పతనమైంది. షేరు ధర ఏకంగా 9.7శాతం కుంగడంతో.. ఒక్కరోజే ఎలాన్‌ మస్క్‌ సంపదలో 20.3 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి.

ఈ ఏడాది జూన్‌లో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ స్థాపించిన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు భారీగా పతనమవ్వడంతో ఆయన సంపద తరిగిపోయింది. మస్క్‌ మళ్లీ బెర్నార్డ్‌ను దాటి ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు టెస్లా షేర్ల నష్టంతో వీరిద్దరి సంపదల మధ్య వ్యత్యాసం తగ్గింది. అయినప్పటికీ మస్కే ఇంకా తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news