పదేళ్లు నన్ను జైల్లోనే ఉంచాలనుకున్నారు.. పాక్ ఆర్మీపై ఇమ్రాన్ ఆరోపణలు

-

పాకిస్థాన్‌ మిలిటరీపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఆర్మీ తనను వచ్చే పదేళ్లు జైలులో ఉంచాలని ప్లాన్‌ చేసిందని ఆరోపించారు. దేశ ద్రోహం నేరం కింద తనను జైళ్లో ఉంచాలని ప్రణాళిక రచించిందని చెప్పారు. అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో వందల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాక్‌ సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం ఆయనకు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి లాహోర్‌లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

‘దేేశ ద్రోహం కింద నన్ను జైల్లో పెట్టారు. అయితే ఇదే ఛాన్స్ అనుకుని పాకిస్థాన్ ఆర్మీ నన్ను పదేళ్లు జైల్లోనే ఉంచాలని పథకం రచించింది. వీలు కాకపోతే నన్ను అక్కడే అంతం చేయాలని కూడా పన్నాగాలు పన్నింది. అప్రమత్తమై నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. నా అదృష్టం బాగుండి వారి కుట్ర నుంచి తప్పించుకున్నాను.’ – ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని

Read more RELATED
Recommended to you

Latest news