రహస్యపత్రాల దుర్వినియోగం కేసు.. ఇమ్రాన్‌పై అభియోగాలు.. నేరం రుజువైతే ఉరిశిక్ష

-

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక తాజాగా ఆయనకు మరో కేసులో ఎదురు దెబ్బ తగిలింది. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్​పై ప్రత్యేక కోర్టు నేరాభియోగాలను మోపింది. ఇమ్రాన్‌తోపాటు పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీలపై వచ్చిన ఆరోపణలను ధ్రువీకరించింది. ఈ కేసులో నేరం రుజువైతే.. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉరిశిక్ష లేదా 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గతేడాది ప్రధాని పదవి నుంచి దిగిపోయేముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్‌ కొన్ని పత్రాలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన చెప్పిన మాటలే.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు కాగా.. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్‌ను భద్రతా సమస్యలు నేపథ్యంలో అక్కడే విచారణ జరపాలని పాక్‌ న్యాయశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌.. అడియాలా జైలుకే వచ్చి విచారణ చేపట్టి. నేరారోపణ తర్వాత.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news