సీఎం జగన్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం…. రాజానగరం దివాన్ చెరువులో డివిబి రాజు లే అవుట్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లి వెళ్తారు.

ఏపీలో రెండు లెదర్ పార్కుల ఏర్పాటుకు లిడ్ క్యాప్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కృష్ణాజిల్లా జి. కొండూరు ప్రకాశం ఎడవల్లిని ఎంపిక చేసి రూ. 12 కోట్లు మంజూరు చేసింది. ఆయా పార్కుల్లో చర్మకార ఉత్పత్తుల తయారిపై శిక్షణ ఇవ్వడంతో పాటు ముడి సరుకు సమకూర్చనున్నారు. దీంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని లిడ్ క్యాప్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.