పాకిస్థాన్ లో హై అలెర్ట్…. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం ముందు భారీగా హింసకు అవకాశం

-

పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ వ్యాప్తంగా భారీగా హింస చెలరేగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న ఇమ్రాన్ ఖాన్ యువత, దేశ ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీంతో పాకిస్తాన్ హై అలెర్ట్ అయింది. ఇప్పటికే దేశ రాజధాని ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పాక్ లోని పలు హక్కుల సంఘాలు ఈ అవిశ్వాస తీర్మాణాన్ని వ్యతిరేఖిస్తున్నాయి.

 

ఇప్పటికే తనను గద్దె దించేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ గద్దె దించుతేనే అమెరికాతో సత్సంబంధాలు ఉంటాయని ఓ రహస్య లేఖ వచ్చిందంటూ ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్ విపక్షాలను మేకల్లా కొంటున్నారని ఆరోపిస్తున్నారు. 342 మంది ఉన్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ 172. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు కేవలం 162 మంది సభ్యలు మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news