ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి 80 దేశాల మద్ధతు.. సంతకం చేయని భారత్

-

 ఉక్రెయిన్‌లో శాంతి సాధనే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌ నిర్వహించిన రెండు రోజుల సదస్సులో దాదాపు 100 దేశాలు పాల్గొన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరిగే ఏ శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.  ఈ ప్రకటనపై మెజారిటీ దేశాలు అంగీకరించాయి. కానీ భారత్​, యూఏఈ తదితర దేశాలు ఏకీభవించలేదు.

‘ఉక్రెయిన్‌లో శాంతి’ అంశంపై స్విట్జర్లాండ్‌లోని బర్జెన్‌స్టాక్‌ రిసార్టులో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడం, అణు భద్రత, ఆహార భద్రత, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఐక్యరాజ్య సమితి ఒప్పందాలతో పాటు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించేలా యుద్ధం ముగించే దిశగా కీలక ఒప్పందం కుదరాలని ప్రకటనలో వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై భారత్‌, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, బ్రెజిల్ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు.  వీటికి రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిష్కార మార్గం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని భారత్‌ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news