భారత్ పై దుష్ప్రచారం : 22 యూట్యూబ్ ఛానల్ల పై వేటు..

-

సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రతను దెబ్బ తీసే అంశాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. భారత్ పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్ల పై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానల్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 చానళ్లపైసమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానల్ల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

భారత్ పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానల్ల లో పై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్లు కూడా ఉన్నట్లు తెలిపింది.ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానల్ల లోగో ని వాడుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వివరించింది.యూట్యూబ్ ఛానల్ల నే కాకుండా మూడు ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించి నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news