అమెరికాలో భార‌త సంత‌తి టెకీ అరెస్ట్‌.. అసలు ఏం జరిగిందంటే…?

-

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అగ్రరాజ్యమైన అమెరికా మొదట్లో ఈ కరోనా మహమ్మారి ని తేలిగ్గా తీసుకోవడంతో ఆ తరువాత పెద్ద మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసులు కేవలం అమెరికాలోనే నమోదవుతున్నాయి. పరిస్థితిని గమనించిన అమెరికా చాలా లేటుగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతలోనే ఆ సమయానికి జరగాల్సిన నష్టం పూర్తిగా వాటిల్లింది. దీంతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలను ప్రకటించింది. నష్టపోయిన కంపెనీలకు ఆసరాగా ఉద్దీపన ప్యాకేజీల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఓ టెక్కీ ఒకరు అడ్డదారి తొక్కి ప్రభుత్వానికి ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల కుచ్చుటోపి పెట్టాలని చూస్తాడు.

arrest
arrest

మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన ముకుంద్ అనే వ్యక్తి అడ్డదారిలో సంపాదించేందుకు ప్రయత్నం చేశాడు. ఆయనకు రాబిన్ హుడ్ అనే బ్రోకరేజ్ సంస్థ ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో అతనికి తీవ్రంగా నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ప్రొటెక్షన్ ప్రోగ్రాం (PPP) ద్వారా లబ్ధి పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే కొన్ని బోగస్ కంపెనీల పేర్లను తప్పుడు పత్రాలతో లోన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు 2.3 మిలియన్లు ఖర్చు అయినట్టు దరఖాస్తులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతనికి లోన్ మంజూరు చేయవలసిందిగా కోరాడు. దీనిపై అమెరికా అధికారులు విచారణ చేపట్టగా, అందులో అసలు ఉద్యోగులే లేరని తేల్చింది. దీంతో ప్రభుత్వాన్ని మోసం చేయడంతో ముకుంద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news