బ్రిటన్ పార్లమెంట్‌లో భగవద్గీతపై భారత సంతతి ఎంపీ ప్రమాణం

-

ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి పార్లమెంట్‌ దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివాని రాజా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. అయితే తాను భగవద్గీతపై ప్రమాణం చేసిన ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు.

37 సంవత్సరాలుగా లేబర్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గంలో విజయం సాధించిన శివాని తన హవా చాటారు. ఈక్రమంలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేసి.. ‘‘లైసెస్టర్‌ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంట్‌లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా ఉంటానని గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది’’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇక యూకేలో 650 పార్లమెంటు స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్‌ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 చోట్ల విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news