ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య యుద్ధం పశ్చిమాసియాలో కుంపటి పెట్టింది. ఇరు వర్గాలు యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే ప్రపంచానికే ముప్పు కలుగుతుందని ఇటీవలే యూఎన్ చీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హమాస్ కీలక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే ఇజ్రాయెల్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని షరతు విధించింది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేస్తే తమ వద్ద ఉన్న బందీలనూ విడిచిపెడతామని హమాస్ స్పష్టం చేసింది.
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి (యుద్ధ నేరం) పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై తాజాగా ఐసీజే విచారణ జరిపింది. ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసు తేలడానికి ఏళ్లు పట్టే అవకాశమున్నందున కనీసం ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపేలా ఆదేశాలివ్వాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సంస్థలను ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకోవడం లేదు.