నేటి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

-

భారత రిపబ్లిక్‌ డే వేడుకలు ఇవాళ దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలో ఉదయం 10.30కు 5వ గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జరుగుతున్న ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటనుంది. ఇందులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన భారత్ చేరుకున్నారు. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో 90 నిమిషాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో మన అపార సైనిక శక్తిని చాటడంతోపాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది రిపబ్లిక్‌ డే థీమ్‌ జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు. సైనిక ప్రదర్శనలో దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతోపాటు క్షిపణులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ఉండనున్నాయి. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. చరిత్రలో తొలిసారిగా మహిళా అధికారులు (దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా) ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు పరేడ్‌లో నేతృత్వం వహించనున్నారు. పరేడ్‌లో 100 మంది మహిళలు సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్‌లో పాల్గొంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శకటాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news