ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిన ప్రాంతం గుర్తింపు.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’

-

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ ప్రకటించింది. ఈరోజు (మే 20వ తేదీ 2024) ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ ను కనిపెట్టినట్లు తెలిపింది.  ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని ఇరాన్ అధికారులు పేర్కొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ వెల్లడించింది. ప్రమాదస్థలానికి సంబంధించిన కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లను మానవరహిత విమాన (UAV) గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది.

The president of Iran died in a helicopter crash

‘తావిల్‌’ అనే ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలి ఉండొచ్చని అనుమానించిన అధికారులు.. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియేకు చెందిన ‘అకింజి’ అనే యూఏవీ.. కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ‘ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌’ కమాండర్‌ సైతం ధ్రువీకరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినా.. రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news