గాజాలో మరో 2 రోజులపాటు కాల్పుల విరమణ

-

ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కుదుర్చుకున్న నాలుగురోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం సోమవారంతో ముగిసింది. అయితే ఈ ఒప్పందం కొనసాగుతుందా.. ముగుస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసింది. ఎట్టకేలకు వారి ఉత్కంఠకు తెరపడింది. ఇజ్రాయెల్‌, హమాస్ మధ్యకాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.

తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడం వల్ల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించి మరోసారి ఇరు వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించగా.. రెండు వర్గాలు రెండు రోజుల పొడిగింపునకు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెలీలను విడిచి పెట్టాల్సి ఉంది. మరోవైపు ప్రతి ఒక్క బందీకి బదులుగా ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదిలి పెట్టనుంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి హమాస్ 58 మంది బందీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్ 114 మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడుదల చేయగా.. నాలుగో విడత కింద హమాస్ మరో 11 మంది బందీలను రెడ్‌ క్రాస్‌ సంస్థకు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version