ఇజ్రాయెల్​కు ఎదురుగాలి మొదలైంది.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

-

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా అంటే తాజాగా బైడెన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి బైడెన్‌ స్వరం మారింది. ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాఖ్య సహా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఉందన్న బైడెన్ కానీ, ఆ మద్దతు కోల్పోవడం మొదలైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విచక్షణా రహితంగా చేస్తున్న బాంబింగే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. కఠిన పదజాలంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును బైడెన్ బహిరంగంగా హెచ్చరించడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.

వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. దీర్ఘకాలిక పరిష్కారానికి నెతన్యాహు ప్రభుత్వం అడ్డంపడుతోందని అన్నారు. అక్కడి ప్రభుత్వంతో సహా ఆయన మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నెతన్యాహు ఓ నిర్ణయం తీసుకోవడాన్ని అక్కడి ప్రస్తుత అతివాద సంకీర్ణ ప్రభుత్వం కఠినంగా మార్చేసిందని.. కొన్ని విషయాలను నెతన్యాహు అర్థం చేసుకొంటాడని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికాపై 9/11 దాడుల అనంతర పరిణామాల నుంచి ఇజ్రాయెల్‌ పెద్దగా నేర్చుకోలేదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news