అంబానీ కుటుంబం చేతికి..ఏపీకి చెందిన 2600 ఎకరాలు వెళ్లినట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని జగన్ చెప్పుకుంటూ వచ్చారు…పరిశ్రమల కోసం వైఎస్ నాడు ఎస్ఈజెడ్ లు ఏర్పాటు చేశారని ఆగ్రహించారు. పరిశ్రమలకు ప్రొత్సహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారని..కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మేం కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారని గుర్తు చేశారు.
2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేస్తామని అనిల్ అంబానీ సంస్థ చెప్పేసిందని..కానీ సడెనుగా అదే అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఏం క్విడ్ ప్రో కో జరిగిందని ఈ భూములను తిరిగి అనిల్ అంబానీకి కట్టబెట్టారు..? అని ప్రశ్నించారు. నియోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామంటే సుమారు 300 ఎకరాల్లో వైఎస్ భూములు కేటాయించారని..ఈ భూములు తిరిగిక ఇచ్చేయమని జగన్ వెంటపడ్డారు.. వాళ్లు కోర్టుకెళ్లారని నిప్పులు చెరిగారు. అపెరల్ పార్కుగా కాకుండా ఇతర జనరల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం కేటాయించాలని అదే సంస్థ కోరిందని..అపెరల్ పార్కు అయితే చాలా మంది మహిళలకు ఉపాధి లభించేదని పేర్కొన్నారు. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి…కానీ జగన్ అవేవీ పట్టించుకోకుండా భూములను కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు.