ఇజ్రాయెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మిస్ యూనివ‌ర్స్ పోటీలు యాథాత‌థం

-

ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జ‌ర‌గాల్సిన మిస్ యూనివ‌ర్స్ – 2021 పోటీ ల‌ను యాథాత‌థం గా జ‌రుపు తామ‌ని ఇజ్రాయ‌మెల్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా ఓమిక్రాన్ వేరియంట్ తో వ‌ణికిపోతుంటే.. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆశ్చ‌ర్య పోతున్నారు. కాగ త‌మ దేశంలో క‌రోనా వైర‌స్ కు సంబంధించిన ఆంక్ష‌లు కూడా విధంచ‌బోమ‌ని కూడా ఇజ్రాయెల్ ప‌ర్య‌టక శాఖ తెలిపింది.

వ‌చ్చే నెల 12 న ఐలాట్ లోని రెడ్ సీ రిసార్ట్ లో మిస్ యూనివ‌ర్స్ -2021 పోటీల‌ను యాథాత‌థం గా నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఈ అందాల పోటీలో పాల్గోనే వారికి ప్ర‌తి 48 గంట‌ల కు ఒక్క సారి కరోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఆఫ్రికా నుంచి వ‌చ్చే వారికి క్వారైంట‌న్ కూడా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు క్వ‌రైంట‌న్ లో ఉన్న ఇజ్రాయెల్ దేశాస్థుల‌ను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తిస్తామ‌ని తెలిపింది. అలాగే ఈ అందాల పోటీలు ప్ర‌పంచ వ్యాప్తం గా 174 దేశాల‌లో ప్ర‌త్యేక్ష ప్ర‌సారం అవుతాయ‌ని.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల ను కూడా చేశామ‌ని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ లో ఇప్ప‌టి కే ఓమిక్రాన్ వేరియంట్ ఒక కేసు న‌మోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news