నేడు తెలంగాణ కేబినెట్ భేటీ… వీటిపైనే ప్రధాన చర్చ..

-

తెలంగాణలో ప్రధాన సమస్యలపై నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించడంతో తాజా కేబినేట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వానాకాలం పంటను రాష్ట్రం చివరిగింజ వరకు కొంటామని చెబుతోంది. అయితే యాసంగి పంట సాగుపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై కూడా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో పాటు కొత్తగా వస్తున్న కరోనా వేరియంట్ ఓమిక్రాన్ పై మంత్రి వర్గం చర్చించనుంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఓమిక్రాన్ నేపథ్యంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో కూడా కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశాన్ని మంత్రిమండలి పరిశీలించనుంది. వీటితో పాటు నష్టాల్లో ఉన్న మెట్రోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు, జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల వర్గీకరణ, నియమాకాల అంశాలు మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news