భారత దేశం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) లో చేరక పోవడం పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధానికి వాణిజ్య రాయబారి టోనీ అబాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఎత్తుగడ తో నే భారత్ RCEP లో చేరడం లేదని టోనీ అబాట్ అన్నాడు. అది ఒక తెలివైన నిర్ణయం గా టోనీ అబాట్ అభివర్ణించాడు. అయితే చైనా నుంచి వాణిజ్య సమస్య లను చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అలాంటి దేశాలకు ప్రత్యామ్నాయం గా ఇండియా కనిపిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం భారత్ ఆర్థికం గా టేకఫ్ తీసుకుని దూసుకు పోతుందని అన్నారు. అందుకే చాలా దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అలాగే భారత్ , ఆస్ట్రేలియా ల మధ్య వాణిజ్య స్వేచ్ఛ ఉంటుందని తాను విశ్వసి్తున్నట్టు తెలిపారు. దానికి కోసం ప్రత్యేకం గా ఒక ఒప్పందం కూడా చేసుకుంటామని తెలిపారు. కాగ RCEP లో ఆసియా – పసిఫిక్ దేశాలు ఉంటున్నాయి. దాదాపు 15 దేశాలు ఇందులో ఉంటున్నాయి. అయితే ఇటీవలే భారత్ దీని నుంచి తప్పుకుంది.