మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల యువకుడిని లోబరుచుకుంది. పలుమార్లు లైంగికదాడి చేసి వీడియోలు తీసింది. బ్లాక్ మెయిల్ చేసి… బంగారం, నగదును దోచుకుంది. తన మాజీ ప్రియుడితో కలిసి వీడియోలు తీసి బెదిరించి నగదును స్వాహా చేసింది. వివరాల్లోకి వెళితే… జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… ఇటీవల 9వ తరగతి చదువుతున్న బాలుడి కుటుంబం టోలీచౌకి నుంచి జూబ్లీహిల్స్ కు మారారు. ఈ సమయంలో అల్మారాలోని 20 తులాల బంగారం కనిపించలేదు..
దీంతో బాలున్ని తల్లి మందలించడంతో అసలు విషయాన్ని తెలిపాడు. బెంగళూర్ లో నివసించే తండ్రి బంధువులకు ఇచ్చానని బాలుడు తెలిపాడు. గతంలో పాఠశఆల వద్దకు వచ్చి తనను చార్మినార్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపాడు. మాజీ ప్రియుడితో కలిసి దీన్ని ఆమె వీడియో తీసి బెదిరించడంతో 20 తులాల బంగారం.. రూ. 6 లక్షలు ఇచ్చామని చెప్పాడు. తన కుమారిడిపై సదురు యువతి మూడుసార్లు లైంగిక దాడి చేసిందని..చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు.