విజయోత్సవ సభలో ట్రంప్ మీద బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

-

అమెరికాకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడేన్ విజయోత్సవ సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం(డెమొక్రాట్స్) పూర్తి ఆధిక్యంతో గెలిచామన్న ఆయన 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రాట్లకి ఓటు వేశారని అన్నారు. ఈ గెలుపు తన విజయం కాదని ఆయన అమెరికన్ ల అందరి విజయం అని పేర్కొన్నారు. సంపూర్ణ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మీరందరూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు.

అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ కు శుభాకాంక్షలు తెలిపిన బైడెన్ ఈ కరోనా సమయంలోనూ పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాత్రి సమయంలో ట్రంప్ పడే వేదనను అర్థం చేసుకోగలను అని ఆయన అన్నారు. ట్రంప్ ఇప్పుడు ఆయన ఓడిపోయారని ఆయన బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను అని అన్నాను. నేను కూడా 1, 2 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, ఈ గెలుపోటములు సహజమని బైడెన్ అన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని అందుకే రికార్డు స్థాయిలో తన గెలిపించారని బైడెన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news