భారతీయులను ఎక్కువ నమ్ముతున్న బిడెన్

అమెరికా అధ్యక్షుడు కాబోతున్న జో బిడెన్ ఇప్పుడు తన కొత్త టీం ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ 500 మందికి పైగా కొత్త టీం ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు ఆయన కీలక పాత్ర ఇస్తున్నారు. వారిలో దాదాపు రెండు డజన్ల మంది ఇండియన్స్ కి కీలక బాధ్యతలు ఇస్తున్నారు.

దేశ తక్షణ సంక్షోభం, కోవిడ్ -19 మహమ్మారిని పరిష్కరించడంలో కొందరు కీలక పాత్ర పోషిస్తారని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. సలహా బోర్డు ఇప్పటికే అమలులో ఉంది. బోర్డులో 13 మంది సభ్యులలో ముగ్గురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. అమెరికా జనాభాలో మన వాళ్ళు ఒక్క శాతం మాత్రమే ఉన్నారు. ఒబామా హయాంలో పని చేసిన మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తిని బిడెన్ కీలక పదవిలో నియమించారు.