యాక్సిడెంట్ గురించి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే.. కారు మాదే కానీ !

సైబర్ టవర్స్ వద్ద మొన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మీద వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన కారు ఆయన కుమారుడు ఓబుల్ రెడ్డి పేరు మీద రిజిస్టర్ అయి ఉండడంతో ఆయన పేరు మీద కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఈ విషయం మీద ఆయన స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడి పేరు తెరమీదకు రావడంతో ఆయన వివరణ ఇవ్వక తప్పలేదు.

నిజానికి గురువారం ఉదయానికి ఈ కారు తమ వద్దకు రావాల్సి ఉందని అయితే తన కుమారుడి స్నేహితుడు కౌశిక్ పని ఉంది అని చెప్పి కారు తీసుకున్నాడు అని పేర్కొన్నాడు అయితే తమ దగ్గరికి తిరిగి వచ్చే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అన్నారు. తమకు సంబంధం లేని అంశంలో నా కొడుకు పేరు అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. పబ్ లో కానీ, ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాని తన కొడుకు లేడని ప్రమాదం జరిగిన రోజు ఓబుల్ రెడ్డి బనగానపల్లె లోనే ఉన్నాడని ఆయన పేర్కొన్నాడు.