ఇది ప్రారంభం మాత్రమే.. ఇజ్రాయెల్-హమాస్​ తాత్కాలిక కాల్పుల విరమణపై బైడెన్

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మొన్నటిదాకా జరిగిన భీకర పోరును చూసిన ప్రపంచం ఇరువర్గాలు చర్చలు జరిపి మారణహోమాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఇక ఇటీవలే చర్చలు సఫలం కావడంతో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్-హమాస్​ అంగీకరించాయి. ఇక శుక్రవారం నుంచి ఇరువైపులా బందీల విడుదల కూడా కొనసాగుతోంది. ఓవైపు హమాస్ తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తోంటే.. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న వారిని బయటకు పంపించేస్తోంది.

తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య సంధి కేవలం ప్రారంభం మాత్రమే అని అన్నారు. అలాగే గాజాలో ఈ తాత్కాలిక విరామాన్ని పొడిగించేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. రోజురోజుకు మరింత మంది బందీలు విడుదలవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మసాచుసెట్స్‌లోని నాన్టుకెట్‌లో పర్యటించిన బైడెన్‌.. ఇజ్రాయెల్‌కు సైనిక సాయం అందించేందుకు అమెరికా షరతులు విధించడం విలువైన ఆలోచనగా అభివర్ణించారు. ఐతే.. ఆ షరతులు ఏమిటో మాత్రం ఆయన వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news