నేరాంగీకారానికి సిద్ధం.. జైలు నుంచి అసాంజే విడుదల

-

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నేరాంగీకరణకు సిద్ధమై అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం కోర్టులో సమర్పించిన పత్రాలు వెల్లడించాయి. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి ఈరోజు ఉదయం విడుదల చేశారు.

పశ్చిమ పసిఫిక్‌లోని యూఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్‌లోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరుకానున్నట్లు సమాచారం. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్ల మరియానా ఐలాండ్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్‌లో విచారణను చేపడుతున్నారు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను ఆయన అంగీకరించనున్నట్లు తెలిసింది. దీన్ని న్యాయమూర్తి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయపోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించటంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news