ఢిల్లీలో పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యక్షం అయ్యారు. ఢిల్లీలోని తాజ్ హోటల్ లో బస చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈడీ విచారణ కోసం పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ నెల 20న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుల ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు ఈడీ ప్రకటన చేసింది.

దీంతో ఈడీ విచారణ కోసం పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఢిల్లీలోనే ఉన్న మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఢిల్లీలోనే ఇద్దరు సోదరులు ఉండటంతో ఈడీ విచారణకేనని ఊహాగానాలు అందుతున్నాయి. ఈడీ దాడుల్లో 16 ఫోన్లు సీజ్ చేసినట్టు సమాచారం అందుతోంది. మరో వైపు ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపి అగ్ర నేతలను కలుస్తారని ఊహాగానాలు అందుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.