అమెరికాలో భారత కాన్సులేట్​కు నిప్పు.. ఖలిస్థానీల దుశ్చర్యే

-

భారత్ కు వ్యతిరేకంగా ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్​ కాన్స్​లెట్​లో విధ్వంసం సృష్టించారు. కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. జులై 2న ఈ ఘటన జరిగింది. ఇండియన్​ కాన్సులేట్​లో మంటలు చెలరేగుతున్న దృశ్యాన్ని ఖలిస్థానీలు ట్విటర్ లో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది హింసను హింస ప్రేరేపిస్తుంది అనే పదాలు ఈ వీడియో కనిపిస్తున్నాయి. కెనడాకు చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్ దీప్ సింగ్ మరణ కథనం కూడా ఈ వీడియోలో ప్రస్తావనకు వచ్చింది.

శనివారం అర్ధరాత్రి దాటాక 1:30- 2:30 గంటల సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్​లో మంటలు చెలరేగాయని అమెరికా మీడియా వెల్లడించింది. దీనిపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అనంతరం మంటలను ఆర్పేసినట్లు పేర్కొంది. ఘటనలో స్పల్ప నష్టం జరిగిందని, ఎవ్వరూ గాయపడలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. అమెరికాలోని విదేశీ రాయబార కార్యాలయాలపై దాడులను నేరపూర్వక చర్యగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news