కొండచరియలు విరిగిపడి 15మంది మృతి.. 60మంది ఆచూకీ గల్లంతు

-

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి దాదాపు 15 మంది మృతి చెందిన ఘటన నైరుతి కాంగోలోని ఇడియోఫా పట్టణంలో ఉన్న ఓడరేవు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శనివారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలను చేపట్టి ఏడుగురిని కాపాడారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగుతోంది.

ఓడరేవు సమీపంలో ఒక పెద్దకొండ ఉందని, భారీ వర్షం కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయని ప్రావిన్షియల్ తాత్కాలిక గవర్నర్ ఫెలిసియన్ కివే  చెప్పారు. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుందని, మార్కెట్కు అధిక సంఖ్యలో ప్రజలు రావడం వల్ల ఎంతమంది గల్లంతయ్యారో అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ప్రమాదంలో గల్లంతైన వారిని కనుగొనేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయక చర్యల్లో ఏడుగురిని ప్రాణాలతో రక్షించగలిగామని వెల్లడించారు. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆస్పత్రికి తరలించామని, ఇంకా 60మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news