ప్రపంచ ప్రపంచ వ్యాప్తం గా అన్ని దేశాలను గడ గడ లాడించిన కరోనా వైరస్ ముప్పు తగ్గింది అనుకున్నారు. కానీ ప్రస్తుతం చాలా దేశాలలో కరోనా మహమ్మారి ప్రజల పై విరుచుక పడుతుంది. ఇప్పటి కే రష్య, జర్మనీ వంటి దేశాలలో రోజు కు వేల సంఖ్య లో కరోనా కేసులు వస్తున్నాయి. తాజాగా మరో దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. యూరప్ దేశం అయిన ఆస్ట్రీయా లో రోజు కు కొత్తగా 15 వేల కు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
ప్రజలు జగ్రత్తలు తీసుకోకుండా బహిరంగంగా తిరగడం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఆస్ట్రీయా ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ తెలిపారు. అందు వల్లే తమ దేశంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని తెలిపారు. పది రోజుల తర్వాత వైరస్ వ్యాప్తి ని బట్టి లాక్ డౌన్ గురించి ఆలోచిస్తామని అన్నారు. కాగ లాక్ డౌన్ సమయం లో ప్రజలు కేవలం అత్యావససరాల కు మాత్రమే బయటకు రావాలని అన్నారు. తప్పకుండా మాస్క్, శాని టైజర్ లను ఉపయోగించాలని సూచించారు.