బీజేపీకి షాక్.. ఎంపీ బరిలో సోయం బాపురావు..!

-

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 08 స్థానాలను దక్కించుకుంది. అంతకు ముందు కేవలం ఇద్దరూ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ తెలంగాణలో కాస్త పుంజుకుంది అనే చెప్పాలి.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 04 స్థానాలను కైవలం చేసుకుంది. ఈ సారి 08 స్థానాల వరకు గెలుచుకుంటామనే ధీమాలో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ అభ్యర్థి సోయం బాపురావును కాదని మరో వ్యక్తి గోడం నగేష్ కి  కేటాయించారు. శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అనంతరం సోయం బాపురావు మీడియాతో మాట్లాడారు. తప్పకుండా ఆదిలాబాద్ లోక్ సభ నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి ఉంటాననేది మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ముగ్గురు సిట్టింగ్ లకు అవకాశం కల్పించి.. తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. టికెట్ విషయంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడం దారుణం అన్నారు సోయం బాపురావు.

Read more RELATED
Recommended to you

Latest news