గాజాలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై కాల్పులు.. 20 మంది మృతి!

-

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో గాజాలో విధ్వంసం నెలకొంది. ఓవైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలు, ఇంకోవైపు వ్యాధులతో విలయం తాండవిస్తోంది. తాజాగా గాజాలో మరో ఘోర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆహారం కోసం వేచి చూస్తున్న సమూహంపై కాల్పులు జరిగినట్లు సీఎన్‌ఎన్‌ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారని సమాచారం. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

యుద్ధ ట్యాంకు లేదా శక్తిమంతమైన తుపాకులతో ఇజ్రాయెల్‌ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు అనుమానం వ్యక్తం చేసినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సరైన వసతులు, ఔషధాలు లేవని తెలిపింది. గాజా ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది సామాన్య పౌరులు మానవతా సాయం కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news