మెక్‌డొనాల్డ్స్‌లో భారీగా లేఆఫ్స్.. ఆఫీసులు క్లోజ్!

-

ఫాస్ట్​పుడ్ దిగ్గజం మెక్​డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని మెక్​డొనాల్డ్స్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. కంపెనీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీల్ జర్నల్ కథనం ప్రచురించింది. సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులలో కొంతమందికి ఉద్వాసన తప్పదంటూ పేర్కొంది. ఉద్యోగులకు మెక్​డొనాల్డ్స్​ కంపెనీ గత వారం ఈ-మెయిల్ చేసిందని .. అందులోనే లేఆఫ్స్​కు సంబంధించి సూచనప్రాయంగా తెలియజేసిందని వాల్ స్ట్రీల్ జర్నల్ తెలిపింది.

‘సోమవారం నుంచి బుధవారం వరకు​ ఇంటి నుంచే పనిచేయాలంటూ మెక్ డొనాల్డ్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు సూచించింది. ఈ వారంలో షెడ్యూల్డ్ మీటింగ్స్ మొత్తం రద్దు చేసుకోవాలని కోరింది.’ అని వాల్​ స్ట్రీట్​ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విటర్, ఎరిక్సన్, ఫిలిప్స్​, యాహూ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇంకా తొలగిస్తున్నాయి కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version