‘మార్షల్‌ ఆర్ట్స్‌తో జుకర్‌బర్గ్‌ ప్రాణాలకు ప్రమాదం’.. మెటా ఆందోళన

-

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ క్రీడాసక్తిపై ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ లో ఆయనకు గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జుకర్‌బర్గ్‌ సహా సంస్థలో ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారని.. వాటిని ఆస్వాదించే క్రమంలో ప్రమాదాలు జరిగితే.. కంపెనీ కార్యకలాపాలపై  ప్రభావం చూపిస్తుందని ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో సంస్థ ప్రస్తావించింది.

 

గతేడాది నవంబరులో మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొంటున్న సమయంలో తన మోకాలికి గాయమైందని.. శస్త్రచికిత్స చేయించుకున్నట్లు జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ క్రీడాసక్తిపై మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జులైలో బ్రెజిలియన్‌ ‘జు జిట్సు’లో జుకర్ బర్గ్ బ్లూ బెల్ట్‌ సాధించారు. అనంతరం తనతో  కేజ్‌ ఫైట్‌కు రావాలని టెస్లా  అధినేత ఎలాన్‌ మస్క్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించారు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాన్ని మస్క్‌ తేలిగ్గా తీసుకున్నారని.. దీన్ని ఇక్కడితో వదిలేస్తానని జుకర్ బర్గ్ అప్పట్లో అన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news