ఏపీ మంత్రి కాకాణీకి బిగ్ రిలీఫ్ దక్కింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ పేర్కొన్న సీబీఐ…కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని వివరించింది. ఏడాది పాటు విచారణ జరిపి 403 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు. 88 మంది సాక్షులను విచారించిన సీబీఐ….టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలను కొట్టి పారేసింది. కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన సీబీఐ… ఏపీ పోలీసుల విచారణను సమర్ధించింది.
సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ దోషులుగా నిర్ధారణ నిర్ధారించింది. దొంగతనాలకు అలవాటుపడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజా…వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని స్పష్టం చేసింది సీబీఐ. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ జరిపింది. సీబీఐ విచారణకు సిద్ధమని హైకోర్టులో ముందే చెప్పిన కాకాణి… సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును కోరారు. ఇక సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే తెలిపింది ఏజీ. ఇక ఇప్పుడు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ పేర్కొన్న సీబీఐ…కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని వివరించింది.