మయన్మార్‌లో మోచా తుపాను బీభత్సం

-

మోచా తుపాను మయన్మార్​లో బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతాన్ని భీకర మోచా తుపాను అతలాకుతలం చేసింది. దీని ధాటికి కమ్యూనికేషన్ల వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. సుమారు ఆరుగురు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు.

గంటకు 209 కి.మీ. వేగంతో వీచిన ప్రచండ గాలుల కారణంగా సుమారు 700 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మోచా తుపాను ప్రభావంతో 10 లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చాయి. రఖినే రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారానికి కూడా వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో నీరు సుమారు అయిదు అడుగుల వరకూ నిలిచే ఉంది. రఖినే రాష్ట్రంలోని 17 టౌన్‌షిప్‌లు విపత్తులో చిక్కుకున్నాయని అధికారులు ప్రకటించారు. మరోవైపు మోచా తుపానుతో తీవ్రంగా ప్రభావితం కానుందని అంచనా వేసిన బంగ్లాదేశ్‌కు చెందిన కాక్స్‌ బజార్‌ విపత్తు బారినుంచి తప్పించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news