త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం – RRR

-

త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అని… నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు అవినాష్ ను అధికారులు ప్రశ్నించగా, మరోసారి విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై స్పందించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో త్వరలోనే అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతుందని, రేపో, మాపో అవినాష్ రెడ్డి గారికి సీబీఐ నోటీసులు జారీ చేస్తే, చంద్రబాబు నాయుడు గారిపై క్విడ్ ప్రోకో కేసు నమోదు కచ్చితంగా డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని అన్నారు. పాలకుల సంకుచిత ఆలోచనలకు అధికారులు బలి అవ్వడం మినహా, ప్రయోజనమేమీ ఉండదని, ఇదో చెత్త ఆలోచనయితే, అంతకు మించి చెత్త అమలు విధానమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news