సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 44 మంది మృతి

-

ఓవైపు హమాస్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాపై వైమానిక దాడులకు తెగబడింది. ఆ దేశంలో అతి పెద్ద నగరమైన అలెప్పో వైమానికి దాడులు జరపగా దాదాపు 44 మంది దుర్మరణం చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులే ఉన్నట్లు ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని పేర్కొంది.

అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్‌ చేసినట్లు సమాచారం. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరిస్తూ.. ఇజ్రాయెల్‌తో పాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని వెల్లడించింది. ఈ దాడిలో మరణించిన వారిలో 36 మంది సిరియా సైనికులు ఉండగా, ఏడుగురు హెజ్బొల్లా సభ్యుడు, సిరియా పౌరుడు ఉన్నారని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news