2,100 దాటిన మొరాకో భూకంప మృతుల సంఖ్య.. నేలమట్టమైన తిఖ్త్‌ గ్రామం

-

మొరాకోలో భూకంపం బీభత్సం సృష్టించింది. దాదాపు 2100 మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఇంకా శిథిలాల కింద వేల మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నా.. ఇప్పటికే భూకంపం వచ్చి 48 గంటలు దాటడంతో బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు క్రమంగా కనుమరుగైపోతున్నాయని అధికారులు అంటున్నారు. కొండల్లో, మారుమూల గ్రామాల్లో ఇళ్లు కూలిపోవడంతో సహాయక బృందాలు ఇంకా అక్కడికి చేరుకునే ప్రయత్నంలోనే ఉన్నారు.

భూకంప కేంద్ర స్థానమైన అట్లాస్‌ పర్వతాలకు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కుగ్రామం తిఖ్త్‌ మొత్తం నేలమట్టమైపోయింది. ఇక్కడ శిథిలాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు పూర్తిగా కట్టుబట్టలతో మిగిలిపోయారు. మొరాకోలో భూకంప బాధితులకు సాయం చేసేందుకు విదేశీ బృందాలు ఇప్పుడిప్పుడే ఆ దేశానికి చేరుకొంటున్నాయి. ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం యూకే, ఖతర్‌, యూఏఈ, ఫ్రాన్స్‌, అమెరికా వంటి దేశాల నుంచి సాయాన్ని అంగీకరించింది. సాయం ప్రకటించిన దేశాలకు మొరాకో రాజు మహమ్మద్‌-6 ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు అట్లాస్‌ పర్వాత ప్రాంతాలను వీడి చాలా మంది ప్రజలు ఇతర ప్రదేశాలకు వలసపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news