ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల హడావుడి కాస్త పెరిగినట్టే కనపడుతుంది. రాజకీయంగా ఉన్న పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రధాన పార్టీలు కాస్త గట్టిగానే కష్టపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సీట్ల పంపకాలకు సంబంధించి అభ్యర్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా డిమాండ్ ఉండే సీట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ అయితే వైసీపీని ఎదుర్కోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. మరోసారి బిజెపి తో కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
అందుకే కొందరి విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. విశాఖ ఎంపీ స్థానం విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉనట్టు సమాచారం. గత ఎన్నికల్లో బాలకృష్ణ చిన్నల్లుడికి ఆ సీటు కేటాయించిన చంద్రబాబు ఈసారి గంటా శ్రీనివాసరావు కి ఇవ్వాలని చూస్తున్నారు. విశాఖ సిటీలో ఒక సీటుని భరత్ కి కేటాయించి అసెంబ్లీ కి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నారట. ఆయనకు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
అలాగే ఏలూరు ఎంపీ స్థానం విషయంలో కూడా చంద్రబాబు జాగ్రత్తగా ఉన్నారనేది రాజకీయ వర్గాల మాట. ఒక సినీ నటుడ్ని అక్కడి నుంచి రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారని లేదంటే రఘురామ కృష్ణం రాజుకి ఆ సీటు ని కేటాయిస్తారని అంటున్నారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి కీలక నిర్ణయం వచ్చే నెలలో వెల్లడి అయ్యే అవకాశం ఉందనే మాట వినపడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక నారా లోకేష్ పాధయాత్రలోనే సీట్లకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.