మొరాకో భూకంపం.. 632కు చేరిన మృతుల సంఖ్య

-

ఉత్తరాఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం విలయం సృష్టించింది. మొత్తంగా ఇప్పటి వరకు 632 మంది ప్రాణాలను బలిగొంది. మరో 329 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. 19 నిమిషాల అనంతరం 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. భూకంపం ధాటికి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అట్లాస్‌ పర్వతాల్లో ఉన్న గ్రామాల నుంచి చారిత్రక నగరం మర్రాకేశ్‌ వరకు భూకంపం తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సృష్టించింది.

మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 70 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వందల మందిని కాపాడా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని .. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news