అమెరికాలో మ‌రొక కొత్త వ్యాధి.. బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాప్తి..

-

క‌రోనా మ‌హ‌మ్మారి భీభ‌త్సం నుంచి ప్ర‌పంచ ఇంకా బ‌య‌ట ప‌డ‌నే లేదు, అప్పుడు ఆ ర‌క్క‌సి కొత్త రూపంలో మ‌ళ్లీ వ‌చ్చి విజృంభిస్తోంది. ఇక ప‌లు చోట్ల ఇప్ప‌టికే వింత వింత వ్యాధుల‌తో జ‌నాలు మృత్యువాత ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అమెరికాలో మ‌రో కొత్త వ్యాధిని అక్క‌డి సైంటిస్టులు గుర్తించారు. స‌ద‌రు వ్యాధి బారిన ప‌డ్డ వారి మెద‌డును సూక్ష్మ క్రిములు తినేస్తాయ‌ని సైంటిస్టులు గుర్తించారు.

new type of brain eating amoeba spreads in usa

అమెరికాలోని మిన్నెసొటా, క‌న్సాస్, ఇండియా త‌దిత‌ర ప్రాంతాల్లో న‌యెగ్లెరియా ఫౌలెరి అనే కొత్త రకం బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి అనేక మంది హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్నారు. ఈ అమీబా స‌రస్సులు, శుభ్రం చేయ‌ని స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిపై ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా వాటిల్లో ఈత కొడితే ఈ అమీబా ముక్కు ద్వారా లోప‌లికి ప్ర‌వేశిస్తుంది. అనంత‌రం అది మెద‌డులోకి ఎంట‌ర్ అయి అక్క‌డ మెద‌డు క‌ణాల‌ను కొద్ది కొద్దిగా తినేస్తుంది. దీంతో తీవ్ర‌మైన ప‌రిణామాలు సంభ‌విస్తాయి.

స‌ద‌రు అమీబా శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌గానే మైగ్రేన్ త‌లనొప్పి వ‌స్తుంది. అలాగే హైప‌ర్ థ‌ర్మియా, స్టిఫ్ నెక్‌, వాంతులు కావ‌డం, త‌ల తిర‌గ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట‌, కంగారు, ఆందోళ‌న‌, భ్ర‌మ‌లు రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు వ‌స్తే వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకోవాలి.

అయితే ఈ అమీబా ఉన్న నీటిని తాగ‌డం వ‌ల్ల అది శ‌రీరంలోకి చేర‌ద‌ని, కేవ‌లం ముక్కు ద్వారానే లోప‌లికి ప్ర‌వేశిస్తుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ఇక ఏటా భూతాపం పెరిగిపోతున్నందున స‌ర‌స్సుల్లో వ్యాధికారక సూక్ష్మ క్రిములు పెరిగిపోయేందుకు అనువైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని, ఈ అమీబా బారిన ప‌డడం వ‌ల్ల న‌మోదవుతున్న కేసులు కూడా ఈ కోవ‌కే చెందుతాయ‌ని సైంటిస్టులు తెలిపారు. అయితే ప్ర‌స్తుతం ఈ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని అన్నారు. కాగా అమెరికాలోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) స‌మాచారం మేర‌కు సైంటిస్టులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news