2024కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పిన న్యూజీలాండ్

-

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు షురూ అయ్యాయి. అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. 2023 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2024కు అంతకుమించి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. పలు దేశాల్లో ఇప్పటికే 2023కు వీడ్కోలు పలికిన ప్రజలు 2024కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచా, రంగురంగుల విద్యుత్‌ దీప కాంతులతో ఆయా నగరాలు జిగేల్‌ మంటున్నాయి.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా షురూ అయ్యాయి.  ఆక్లాండ్‌కు ఐకాన్‌గా భావించే ప్రఖ్యాత స్కైటవర్ వద్ద జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. తమ ఆత్మీయులను హగ్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రఖ్యాత స్కై టవర్ బాణసంచా వెలుగులు, రంగు రంగుల విద్యుత్‌ దీపకాంతులతో జిగేల్ జిగేల్మంటూ ధగధగలాడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version