కామారెడ్డిలో దారుణం.. ఏడేళ్ల కుమార్తెను మంటల్లో విసిరేసిన తండ్రి

-

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది మద్యం మత్తులో ఓ తండ్రి ఏడేళ్ల కుమార్తెను మంటల్లోకి విసిరేశాడు. గమనించిన పక్కింటి వ్యక్తి బాలికను మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే బాలిక స్వల్పంగా గాయపడగా స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌ మండలం బరంగేడ్కి గ్రామంలో సాయిలు అనే వ్యక్తి మద్యం మత్తులో ఏడేళ్ల కుమార్తెను మంటల్లో విసిరేశాడు. అంతకుముందు గంగాధర్‌కు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. అయితే బాలికే గడ్డివాముకు నిప్పుపెట్టిందని సాయిలుతో గంగాధర్‌ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో కోపంతో తండ్రి సాయిలు కుమార్తెను గడ్డివాము మంటల్లో వేసిరేశాడు. వెంటనే స్పందించినపొరుగింటి గంగాధర్‌ బాలికను కాపాడాడు. ఈ ఘటనలో బాలిక స్వల్ప గాయాలతో బయటపడింది. సాయిలు తీరుపై స్థానికులు మండిపడ్డారు. మద్యం మత్తులో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని స్థానికులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version